Gulam nabi azad | కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ స్పష్టం చేశారు. తాను 24 క్యారెట్ల కాంగ్రెస్ మనిషినే అని ప్రకటించారు. అధిష్ఠానంపై ఏమాత్రం అసంతృప్తితో లేనని, కార్యకర్తలందర్నీ ఏకతాటిపైకి నడిపించడానికి తాను కృషి చేస్తున్నానని చెప్పుకొచ్చారు. ”నేను పక్కా కాంగ్రెస్ మనిషినే. కాంగ్రెస్లో లేనని ఎవరన్నారు? 24 క్యారెట్ల కాంగ్రెస్ మనిషిని.” అని ఆజాద్ స్పష్టం చేశారు.