Calcutta High Court | 2 నిమిషాల సుఖం కోసం లొంగిపోతే మీకే నష్టం.. యుక్త వయస్కులు లైంగిక వాంఛలను నియంత్రించుకోవాలి: కలకత్తా కోర్టు
పోక్సో కేసులో కలకత్తా హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. లైంగిక కోరికలను నియంత్రించుకోవాలని యుక్తవయస్కులకు సూచించింది. ముఖ్యంగా యువతులు 2 నిమిషాల సుఖం కోసం లొంగిపోవద్దని పేర్కొన్నది. ఇది సమాజంలో ఆమె గౌరవాన్ని తగ్గిస్తుందని, చెడ్డపేరు తెస్తుందని పేర్కొన్నది.
- యుక్త వయస్కులకు కలకత్తా కోర్టు సూచన
Calcutta High Court | కోల్‌కతా, అక్టోబర్ 20: పోక్సో కేసులో కలకత్తా హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. లైంగిక కోరికలను నియంత్రించుకోవాలని యుక్తవయస్కులకు సూచించింది. ముఖ్యంగా యువతులు 2 నిమిషాల సుఖం కోసం లొంగిపోవద్దని పేర్కొన్నది. ఇది సమాజంలో ఆమె గౌరవాన్ని తగ్గిస్తుందని, చెడ్డపేరు తెస్తుందని పేర్కొన్నది. పరస్పర అంగీకారంతో సెక్స్‌లో పాల్గొనే కేసుల్లో పోక్సో చట్టాన్ని ప్రయోగించే అంశంపై ఆందోళన వ్యక్తంచేస్తూ కోర్టు పై వ్యాఖ్యలు చేసింది. మైనర్ అయిన తన భార్యతో శారీరక సంబంధంలో పాల్గొన్న ఓ వ్యక్తికి సెషన్స్ కోర్టు 20 ఏండ్ల జైలుశిక్ష విధించింది. ఈ తీర్పుపై యువకుడు కలకత్తా హైకోర్టును ఆశ్రయించగా.. దీనిపై జస్టిస్ చిత్తరంజన్ దాస్, జస్టిస్ పార్థసారథిసేన్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది.
తన ఇష్టపూర్వకంగానే సంబంధం పెట్టుకున్నానని సదరు బాలిక కోర్టుకు తెలిపింది. అనంతరం అతడిని పెండ్లి చేసుకొన్నట్టు చెప్పింది. 18 ఏండ్లలోపు పెండ్లి చేసుకోవడం చట్ట విరుద్ధమని ఆమె కోర్టు ఎదుట ఒప్పుకొన్నది. దీంతో ఈ కేసులో నిందితుడిని కలకత్తా కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. ఈ సందర్భంగా యువతీయువకులకు ధర్మాసనం పలు సూచనలు జారీ చేసింది. బాలికలకు వ్యక్తిత్వం, ఆత్మగౌరవం అన్నింటికంటే ముఖ్యమని సూచించింది. అలాగే, అమ్మాయిలను అబ్బాయిలు గౌరవించాలని పేర్కొన్నది. వారి హక్కులు, గోప్యతను కాపాడాలని సూచించింది. ఈ విషయంలో తల్లిదండ్రులే మొదటి గురువుగా ఉండాలని, పిల్లలకు మంచిచెడులు చెప్పాలని తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

