న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: పార్లమెంట్లో ఈనెల 13న సంయుక్త పార్లమెంటరీ సంఘం(జేపీసీ) ప్రవేశపెట్టిన వక్ఫ్(సవరణ) బిల్లును కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది. ఫిబ్రవరి 19న జరిగిన సమావేశంలో కేంద్ర క్యాబినెట్ బిల్లుకు చేసిన సవరణలను ఆమోదించినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
పార్లమెంట్లో 2005 వార్షిక బడ్జెట్ సమావేశాల మొదటి భాగం సందర్భంగా లోక్సభ, రాజ్యసభలో జేపీసీ నివేదికను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కేంద్ర క్యాబినెట్ గత వారం జేపీసీ నివేదికను ఆమోదించడంతో మార్చి 10 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు.