సీఎన్జీ షాక్ : ఇంధన ధరల పెరుగుదలకు నిరసనగా క్యాబ్, ఆటో డ్రైవర్ల ఆందోళన !
సీఎన్జీ ధరల పెరుగుదలకు నిరసనగా ఓలా, ఊబర్ ఆటోలు, క్యాబ్‌ల డ్రైవర్లు శుక్రవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించారు. ధరల పెంపును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
న్యూఢిల్లీ : సీఎన్జీ ధరల పెరుగుదలకు నిరసనగా ఓలా, ఊబర్ ఆటోలు, క్యాబ్‌ల డ్రైవర్లు శుక్రవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించారు. ధరల పెంపును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్, సీఎన్జీ ధరలు విపరీతంగా పెరగడంతో పబ్లిక్, ప్రైవేట్ వాహనాలను నడపడం తమకు భారంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు.
సీఎన్జీ ధరలు కిలోకు రూ 70కి చేరాయని, ఇప్పటికీ తాము పాత చార్జీలతోనే క్యాబ్‌లు, ఆటోలు నడుపుతున్నామని, పెరిగిన ధరలతో వీటిని నడపడం తమకు ఇక సాధ్యం కాదని వాహన డ్రైవర్లు స్పష్టం చేశారు.
తమ చార్జీలను సవరించాలని లేని పక్షంలో పెరిగిన సీఎన్జీ ధరలను వెనక్కితీసుకోవాలని సర్వోదయ డ్రైవర్స్ వేల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు రవి రాధోడ్ డిమాండ్ చేశారు. వరుసగా రెండు రోజులు సీఎన్జీ ధరలను పెంచడంతో దేశ రాజధానిలో సీఎన్జీ ధర కిలోకు రూ 69.11కు ఎగబాకింది. గత నెలరోజులుగా సీఎన్జీ ధరలు ఏకంగా కిలోకు రూ 13.1 భారమయ్యాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Auto Driver
- cab
- CNG prices
- Delhi
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

