Byju’s: బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌కు ఆర్నెళ్ల జైలుశిక్ష విధించిన సింగపూర్ కోర్టు
Byju's: బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌కు ఆరు నెలల జైలుశిక్ష పడింది. సింగపూర్ కోర్టు ఆ శిక్ష విధించినట్లు తెలుస్తోంది. ఆస్తుల వివరాలను వెల్లడించేందుకు రవీంద్రన్ విస్మరించారు. దీంతో కోర్టు ధిక్కరణ కేసులో సింగపూర్ కోర్టు జైలుశిక్ష ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.
న్యూఢిల్లీ: బైజూస్(Byju’s) వ్యవస్థాపకుడు రవీంద్రన్‌కు ఆరు నెలల జైలుశిక్ష పడింది. సింగపూర్ కోర్టు ఆ శిక్ష విధించినట్లు తెలుస్తోంది. ఆస్తులకు చెందిన వివరాలను వెల్లడించేందుకు రవీంద్రన్ విస్మరించిన కేసులో సింగపూర్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2024 ఏప్రిల్‌లో ఆ కేసు నమోదు అయ్యింది. అయితే అధికారుల ముందు లొంగిపోవాలని బైజూస్ వ్యవస్థాపకుడికి కోర్టు ఆదేశాలు ఇచ్చింది. సుమారు 90 వేల డాలర్లు కూడా చెల్లించాలని సింగపూర్ కోర్టు తన ఆదేశాల్లో పేర్కొన్నది. బీయర్ ఇన్వెస్ట్‌కో పీటీ సంస్థ ఓనర్‌షిప్‌కు సంబంధించిన డాక్యుమెంట్లను చూపించాలని కూడా కోర్టు పేర్కొన్నది.
విదేశీ పెట్టుబడిదారుల నుంచి ఇప్పటికే బైజూస్ సంస్థ తీవ్ర సమస్యలను ఎదుర్కొంటోంది. విదేశీయుల నుంచి సుమారు 1.2 బిలియన్ల డాలర్ల రుణం తీసుకున్నట్లు బైజూస్‌పై ఆరోపణలు ఉన్నాయి. అయితే సింగపూర్ కోర్టు ఇచ్చిన ఆదేశాలపై రవీంద్రన్ ఇంకా స్పందించలేదు. ఆయన ఎక్కడ ఉన్నారో స్పష్టంగా తెలియదు.
ఎడ్యుకేషనల్ టెక్నాలజీ సంస్థ థింక్ అండ్ లెర్న్ను ఆయన స్థాపించారు. అదే బైజూస్ సంస్థగా ఫేమస్ అయ్యింది. ఆ సంస్థ ఏర్పాటు తర్వాత ఆయన బిలియనీర్ అయ్యారు. ఇండియన్ స్టార్టప్ రంగంలో అసాధారణ విజయం సాధించిన వ్యక్తిగా నిలిచారు. దీంతో కొన్ని విదేశీ కంపెనీలు ఆయన సంస్థలో పెట్టుబడి పెట్టాయి. అయితే సింగపూర్ కోర్టు బైజూస్ కంపెనీపై ఫోకస్ పెట్టింది. కోర్టు ధిక్కరణ కేసులో అతనికి ఆరు నెలల జైలుశిక్ష విధించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

