Viral Video | పని నిమిత్తం ప్రభుత్వ కార్యాలయానికి వచ్చిన ఓ వ్యక్తి కూర్చున్న కుర్చీలోనే కుప్పకూలిపోయాడు. విషయం తెలుసుకున్న ఐఏఎస్ అధికారి వెంటనే స్పందించి సీపీఆర్ చేసి ఆ వ్యక్తి ప్రాణాలు కాపాడారు. ఈ ఘటన చండీగఢ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..
చండీగఢ్‌లోని సెక్టార్ 41కి చెందిన జనక్ లాల్ ఏదో పనిపై మంగళవారం ఉదయం చండీగఢ్ హౌసింగ్ బోర్డు కార్యాలయానికి వచ్చాడు. అక్కడ కుర్చీలో కూర్చుని ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. విషయం తెలుసుకున్న ఆరోగ్యశాఖ కార్యదర్శి యశ్పాల్ గార్గ్ వెంటనే తన సీటులోంచి లేచి పరిగెత్తుకుంటూ వచ్చి.. సీపీఆర్ చేసి ఆ వ్యక్తి ప్రాణాలు కాపాడారు. అయితే, జనక్ లాల్‌కు గుండెపోటు రావడంతో కుప్పకూలినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మాలివల్ ట్విట్టర్లో షేర్ చేయగా.. ప్రస్తుతం అది వైరల్ అవుతోంది.
एक आदमी को हार्ट अटैक आया तो चंडीगढ़ के हेल्थ सेक्रेटरी IAS @Garg_Yashpal जी ने तुरंत CPR देकर उस आदमी की जान बचाई। उनके इस काम की जितनी सराहना की जाए उतनी कम है। हार्ट अटैक से जानें बचाई जा सकती हैं। हर इंसान को CPR सीखना चाहिए। pic.twitter.com/C7dWVsAoOI
— Swati Maliwal (@SwatiJaiHind) January 18, 2023