ముంబై : దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ‘బుల్లి బాయ్’ యాప్ కేసులో బెంగళూరులో అరెస్టు చేసిన ఇంజినీరింగ్ స్టూడెంట్ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పోలీసులు మంగళవారం బాంద్రా కోర్టులో పోలీసులు హాజరు పరిచారు. ఈ సందర్భంగా ఈ నెల 10 వరకు కోర్టు విశాల్‌కుమార్‌ను కస్టడీకి పంపింది. బుల్లి బాయ్ యాప్ కేసులో విశాల్ కుమార్ (21) అనే ఇంజినీరింగ్ స్టూడెంట్ను పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితురాలు ఉత్తరాఖండ్‌కు చెందిన మహిళ అని ముంబై పోలీసులు తెలిపారు. ఇప్పటికే ఉత్తరాఖండ్‌లో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. నిందితులిద్దరూ ఒకరికొకరు తెలుసునని పేర్కొన్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రధాన నిందితురాలైన మహిళ బుల్లి బాయ్ యాప్‌కు సంబంధించి మూడు ఖాతాలను నిర్వహిస్తోంది.బుల్లీ బాయ్ యాప్‌లో నిందితురాలికి మూడు ఖాతాలు ఉన్నాయని, విశాల్‌కు ఖల్సా సుప్రీమాసిస్ట్ పేరుతో ఖాతా ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత, 31 డిసెంబర్ 2021న విశాల్ ఇతర ఖాతాల పేర్లను కూడా సిక్కు పేర్లను పోలి ఉండేలా మార్చినట్లు పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నట్లు ముంబై పోలీసులు వివరించారు.
The hosting platform is based abroad. Delhi Police has got approval for MLAT (Mutual Legal Assistance Treaty in Criminal Matters) from GNCT. The investigation is progressing: Additional CP & Delhi Police PRO, Chinmoy Biswal on Sulli deals
— ANI (@ANI) January 4, 2022