రెంట్ చెల్లించలేదని బ్యాంకుకు తాళం వేసిన బిల్డింగ్ యజమాని
రెంట్ చెల్లించలేదని ఏకంగా బ్యాంకుకు బిల్డింగ్ యజమాని తాళం వేసిన ఘటన యూపీలోని మీరట్ జిల్లా దురాలా ప్రాంతంలో వెలుగుచూసింది.
లక్నో : రెంట్ చెల్లించలేదని ఏకంగా బ్యాంకుకు బిల్డింగ్ యజమాని తాళం వేసిన ఘటన యూపీలోని మీరట్ జిల్లా దురాలా ప్రాంతంలో వెలుగుచూసింది. అద్దె చెల్లించడం లేదని జిల్లా సహకార బ్యాంక్ సకోటి బ్రాంచ్‌కు యజమాని తాళం వేశాడు. భవన యజమాని కిరణ్‌పాల్ సింగ్ తన భవనాన్ని సహకార బ్యాంక్ బ్రాంచ్‌కు అద్దెకు ఇచ్చాడు.
అద్దె విషయమై గత ఎనమిదేండ్లుగా భవన యజమాని, బ్యాంక్‌కు మధ్య వివాదం నడుస్తోంది. అద్దె మొత్తం చెల్లించేవరకూ బ్యాంకును ఓపెన్ చేసేందుకు అనుమతించనంటూ యజమాని సింగ్ బుధవారం బ్యాంక్‌కు తాళం వేశాడు. జిల్లా సహకార బ్యాంక్ చైర్మన్ నచ్చచెప్పిన మీదట బ్యాంకు తాళం ఓపెన్ చేశాడు. 2007లో బ్యాంకుకు భవనాన్ని తాను అద్దెకు ఇచ్చానని ఒప్పందం కూడా ముగిసిందని యజమాని చెప్పుకొచ్చాడు.
బ్యాంకు అధికారులకు తాను పలుమార్లు దరఖాస్తు చేసినా ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఒప్పందం ముగిసిన తర్వాత రెంట్ పెంచాల్సింది పోయి తగ్గించారని వాపోయాడు. బ్యాంకు అధికారుల తీరుతో విసిగిన యజమాని బ్యాంకుకు తాళం వేశాడు. చివరకు జిల్లా సహకార బ్యాంక్ చైర్మన్ మణిందర్ పాల్ సింగ్ విజ్ఞప్తి చేయడంతో బ్యాంకును ఓపెన్ చేసేందుకు యజమాని అంగీకరించాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

