గాంధీనగర్: ఒక ఫోక్ సింగర్‌పై డబ్బుల వర్షం కురిపించారు. బకెట్లతో కరెన్సీ నోట్లను ఆమెపై గుమ్మరించారు. గుజరాత్‌కు చెందిన ప్రసిద్ధ జానపద గాయని ఊర్వశి రదాదియా ఇటీవల శ్రీ సమస్త్ హిరావాది గ్రూప్ నిర్వహించిన కార్యక్రమంలో పాటలు పాడారు. ఈ సందర్భంగా ఆమెపై డబ్బుల వర్షం కురిపించారు. ఒక వ్యక్తి బకెట్‌తో గాయని తలపై నోట్లను గుమ్మరించాడు. కాగా, అప్పటికే ఆ వేదిక నిండా కరెన్సీ నోట్లు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.
జానపద గాయని ఊర్వశి ఈ వీడియోను ఇటీవల తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ‘మీ అమూల్యమైన ప్రేమకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు’ అని అందులో పేర్కొన్నారు. మరోవైపు వైరల్ అయిన ఈ వీడియోపై నెటిజన్లు వెరైటీగా స్పందించారు. బాప్రే నోట్ల వర్షం అని ఒకరు, గుజరాతీ సాంగ్ పవర్ అని మరొకరు వ్యాఖ్యానించారు. రూ.500 తనకు ఇవ్వాలంటూ ఒకరు ఫన్నీగా కామెంట్ చేశారు.
https://www.instagram.com/reel/CWSR2BuD7-z/?utm_source=ig_web_copy_link