సమాజ్వాదీ వ్యవహార శైలిపై బీఎస్పీ అధినేత్రి మాయావతి తీవ్రంగా మండిపడ్డారు. సమాజ్వాదీ పార్టీ బీజేపీ బీ టీమ్ అని అభివర్ణించారు. తన పార్టీ కంటే బీజేపీపైనే ములాయం సింగ్ యాదవ్ ఎక్కువ ప్రేమ చూపిస్తున్నారని ఆరోపించారు. గతంలో అఖిలేశ్ యాదవ్ బీజేపీ ఆశీస్సులు కూడా తీసుకున్నారని, వారి మనుషులను కూడా బీజేపీలోకి పంపారని పరోక్షంగా అపర్ణ యాదవ్ చేరికను మాయావతి ప్రస్తావించారు. అంబేద్కర్ సిద్ధాంతాన్ని ఆచరించే వారు సమాజ్వాదీని ఎన్నటికీ మరిచిపోరని ఆమె హెచ్చరించారు. తాము చాలా పథకాలకు అంబేద్కర్ పేర్లు పెడితే, అఖిలేశ్ ప్రభుత్వం వాటి పేర్లను మార్చేసిందని ట్విట్టర్ వేదికగా మాయావతి తీవ్రంగా మంపపడ్డారు.