హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): ఢిల్లీ పేలుడుపై బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పేలుడుపై స్పందించారు. ఢిల్లీలోని రెడ్‌ఫోర్ట్ మెట్రోస్టేషన్ సమీపంలో జరిగిన పేలుడువార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి, బాధకు లోనైనట్లు తెలిపారు.
‘ఈ విషాదకర సంఘటనలో అమాయక ప్రజలు పలువురు మరణించారనే వార్త నిజంగా హృదయ విదారకం. బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’ అని కేటీఆర్ తెలిపారు.