హైదరాబాద్, డిసెంబర్13 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం చేస్తున్న చట్టాలను కచ్చితంగా పబ్లిక్ డొమైన్లో ఉంచాలని బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు. అనవసరమైన, వాడుకలో లేని 76 చట్టాలను రద్దు చేసే బిల్లుపై రాజ్యసభలో బుధవారం చర్చ కొనసాగింది. న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ బిల్లుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
బిల్లుపై చర్చలో బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్‌రెడ్డి మాట్లాడారు. కాలం చెల్లిన బిల్లుల రద్దును స్వాగతించారు. చైతన్యం అంటే కాలం చెల్లిన చట్టాలను తొలగించడమే కాదని, సాధారణ ప్రజలకు మేలు చేసే చట్టాలను తీసుకొచ్చి వాటికి సరైన మార్గదర్శకాలను రూపొందించడమన్నారు.