భారత్, పాక్.. వీడిపోయినప్పుడు ఆ ఇద్దరు అన్నదమ్ములు విడిపోయారు. ఒకరు పాకిస్తాన్లో… మరొకరు భారత్‌లోని పంజాబ్‌లో ఉంటున్నారు. ఒకరికొరికి ఆత్మీయ స్పర్శే మరిచిపోయారు. అలాంటిది 74 సంవత్సరాల తర్వాత కర్తార్‌పూర్‌లో మంగళవారం కలుసుకున్నారు. ఒకరినొకరు గాఢంగా ఆలింగనం చేసుకొని,భావోద్వేగానికి లోనయ్యారు.
మహ్మద్ సిఖ్ఖిఖీ, హబీబ్ ఇద్దరూ అన్నదమ్ములు. సిఖ్ఖిఖీ పాక్‌లోని ఫైసల్బాద్లో ఉంటాడు. హబీబ్ భారత్‌లోని పంజాబ్‌లో ఉంటున్నాడు. దేశ విభజన సందర్భంగా వీళ్లు విడిపోయారు. ఇటీవల కర్తార్‌పూర్ కారిడార్ గురుద్వారా సాహిబ్ దర్శనానికి హబీబ్ వచ్చాడు. ఇక్కడే ఆ అన్నదమ్ములిద్దరూ కలుసుకున్నారు. గాఢంగా ఆలింగనం చేసుకొని, ఆనందంతో కన్నీరు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా హబీబ్ మాట్లాడుతూ… కర్తార్‌పూర్ కారిడార్ నిర్మించడాన్ని అభినందించారు. విభజన సమయంలో విడిపోయిన కుటుంబాలు తిరిగి దగ్గరికి కావడానికి ఎంతో ఉపకరిస్తుందని ఆనందం వ్యక్తం చేశారు.
After a long time, I watched something that really made me a little emotional. Two brothers, one from India's Punjab and the other from Pakistan's Punjab, met in Kartarpur 74 years after they were separated. pic.twitter.com/AIlfPpDEPy
— Roohan Ahmed (@Roohan_Ahmed) January 12, 2022