తిరువనంతపురం: బ్రిటిష్ ఎఫ్-35 ఫైటర్ జెట్ శనివారం రాత్రి 9.28 గంటల సమయంలో తిరువనంతపురం విమానాశ్రయంలో అత్యవసరంగా దిగింది. ఇంధనం తక్కువగా ఉండటంతో పైలట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు విజ్ఞప్తి చేశారని.. దీంతో వెంటనే స్పందించి అది సురక్షితంగా దిగేందుకు సహకరించినట్టు ఎయిర్పోర్ట్ వర్గాలు అదివారం తెలిపాయి.
ఫైటర్ జెట్‌లో ఇంధనం నింపామని.. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే అది తిరిగి బయలుదేరి వెళ్లడానికి అనుమతిస్తామని అధికారులు తెలిపారు. సముద్ర తీరానికి సుమారు వంద నాటికల్ మైళ్ల దూరంలో ఓ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ నుంచి ఆ ఫైటర్ జెట్ బయలుదేరినట్టు సమాచారం.