Brij Bhushan Singh | ఉరి శిక్షకూ సిద్ధం…రెజ్లింగ్‌ను మాత్రం నిలిపివేయకండి : బ్రిజ్ భూషణ్ సింగ్
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు (డబ్ల్యూఎఫ్ఐ) బ్రిజ్ భూషణ్ సింగ్ (Brij Bhushan Singh) కీలక వ్యాఖ్యలు చేశారు.
న్యూఢిల్లీ : లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు (డబ్ల్యూఎఫ్ఐ) బ్రిజ్ భూషణ్ సింగ్ (Brij Bhushan Singh) సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు. నిరసనలు, ఆందోళనలతో నాలుగు నెలలుగా క్రీడలు నిలిచిపోయాయని తనను ఉరి తీసినా అందుకు తాను సిద్ధమేనని, అయితే రెజ్లింగ్ కార్యకలాపాలను మాత్రం నిలిపివేయవద్దని కోరారు.
వినేష్ పొఘట్, సాక్షి మాలిక్, బజరంగ్ పునియా సహా పలువురు ప్రముఖ రెజ్లరు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్ సింగ్‌ను అరెస్ట్ చేయాలని, ఫెడరేషన్ నుంచి తొలగించాలని రెజ్లర్లు గత కొంత కాలంగా డిమాండ్ చేస్తున్నారు. మహిళా రెజ్లర్లను డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని ఆరోపిస్తూ రెజ్లర్లు చేపట్టిన నిరసనలో పలువురు రెజ్లర్లు పాల్గొంటుండటంతో చాంపియన్‌షిప్‌లు, క్యాంపులు సహా రెజ్లింగ్ కార్యకలాపాలన్నీ నిలిచిపోయాయి.
బ్రిజ్ భూషణ్ సింగ్‌పై లైంగిక ఆరోపణలకు సంబంధించి రెండు ఎఫ్ఐఆర్లు దాఖలయ్యాయి. రెజ్లింగ్ కార్యకలాపాలు నిలిపివేయడం క్యాడెట్లు, జూనియర్ రెజ్లర్ల అభివృద్ధికి విఘాతమని, వారి భవిష్యత్‌కు ఆటంకం కలిగించవద్దని బ్రిజ్ భూషణ్ సింగ్ అభ్యర్ధించారు. కాగా తాను 1000 మందిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డానని ఆరోపిస్తున్నారని, అసలు ఇంతమందిపై వేధింపులకు పాల్పడేందుకు తానేమైనా శిలాజాలతో చేసిన రోటీలను తింటున్నానా అని ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.
Read More
Priyank Kharge | ప్రధాని మోదీ పనికిరాని కొడుకు.. ఖర్గే కుమారుడి వివాదాస్పద వ్యాఖ్యలు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

