Bride Rides Horse | సాధారణంగా పెళ్లి మండపానికి నూతన వధూవరులు.. కారులో వెళ్తారు. కానీ.. ఈ పెళ్లికూతురు మాత్రం వెరైటీగా గుర్రం మీద స్వారీ చేస్తూ వెళ్లింది. ఈ మధ్య పెళ్లిళ్లలో చాలామంది ఇలాగే కొత్తగా ట్రై చేస్తున్నారు. కొందరైతే ఏకంగా సైకిళ్ల మీద కూడా పెళ్లిమండపానికి చేరుకుంటున్నారు.
బీహార్‌కు చెందిన అనుష్క గుహా అనే ఓ యువతి ఎయిర్ హోస్టెస్‌గా పనిచేస్తోంది. తన పెళ్లికి స్పెషల్ లెహంగా వేసుకొని గుర్రం ఎక్కి స్వారీ చేస్తూ పెళ్లిమండపం చేరుకుంది. తను గుర్రంపై స్వారీ చేస్తుండగా.. తనకు డ్యాన్సులతో బంధువులు వెల్కమ్ చెప్పారు.
గుర్రం మీదనే స్వారీ చేస్తూ తనకు కాబోయే వరుడి ఇంటికి వెళ్లిన అనుష్క.. ఆ తర్వాత పెళ్లిమండపానికి వెళ్లింది. పెళ్లికొడుకు మాత్రం కారులో పెళ్లిమండపానికి చేరుకున్నాడు. ఇక.. పెళ్లికూతురు గుర్రం మీద కూర్చొని పెళ్లి మండపానికి వెళ్లిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు.. ఆ వీడియోపై స్పందిస్తూ సూపర్ దీదీ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Ectopic Pregnancy | వైద్యశాస్త్రానికే సవాల్.. మహిళ కాలేయంలో పెరుగుతున్న శిశువు
Momo Paratha | మోమో పరాటా తిన్నారా ఎప్పుడైనా? టేస్ట్ ఎలా ఉంటుందో తెలుసా? వైరల్ వీడియో
TV Star | ఒక్క వారంలోనే 37 లక్షలు సంపాదించిన టీవీ సెలబ్రిటీ.. ఎలాగో తెలిస్తే నోరెళ్లబెడతారు
Seoul Milk | మహిళలను ఆవులుగా చూపిస్తూ యాడ్ తీశారు.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? వైరల్ వీడియో