brick kiln wall collapse | కూలిన ఇటుక బట్టీ గోడ.. ఆరుగురు కార్మికులు మృతి
brick kiln wall collapse | ఇటుక బట్టీ గోడ కూలింది. (brick kiln wall collapse) ఈ సంఘటనలో ఆరుగురు కార్మికులు మరణించారు. అధికారులు జేసీబీతో సహాయక చర్యలు చేపట్టి శిథిలాలను తొలగించారు.
డెహ్రాడూన్: ఇటుక బట్టీ గోడ కూలింది. (brick kiln wall collapse) ఈ సంఘటనలో ఆరుగురు కార్మికులు మరణించారు. అధికారులు జేసీబీతో సహాయక చర్యలు చేపట్టి శిథిలాలను తొలగించారు. ఉత్తరాఖండ్‌లోని రూర్కీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. లహ్వౌలి గ్రామంలోని ఇటుక బట్టీ వద్ద కొందరు కూలీలు పని చేస్తున్నారు. మంగళవారం ఉదయం 7 గంటల సమయంలో ఇటుక బట్టీకి చెందిన ఒక గోడ కూలింది. అక్కడ పని చేస్తున్న కూలీలపై పడింది. దీంతో ఇటుకల కింద కూలీలు చిక్కుకున్నారు.
కాగా, ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు, అధికారులు స్పందించారు. జేసీబీని రప్పించి ఇటుక శిథిలాలను తొలగించారు. ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు మరణించారు. మరికొందరు గాయపడ్డారు. క్షతగాత్రులను రూర్కీలోని జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హరిద్వార్ కలెక్టర్ ధీరాజ్ సింగ్ గర్బియాల్, హరిద్వార్ ఎస్ఎస్పీ ప్రమేంద్ర దోభాల్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తామని అధికారులు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

