Delhi | దేశ రాజధాని ఢిల్లీ నగరంలో వాతావరణ కాలుష్యం కొనసాగుతున్నది. దాంతో జనం తీవ్రమైన శ్వాసకోశ సమస్యలతో ఇబ్బందులుపడుతున్నారు. ఈ క్రమంలో సింగపూర్ హైకమిషన్ ఢిల్లీ-నేషనల్ క్యాపిటల్ రీజియన్లోని పౌరులకు అడ్వైజరీ జారీ చేసింది. ఇంట్లోనే ఉండాలని.. బయటకు వచ్చిన సమయంలో మాస్క్లు ధరించాలని సూచించింది. కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (CPCB) ‘సమీర్’ యాప్ ప్రకారం.. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మధ్యాహ్నం 2 గంటల సమయంలో 437గా నమోదైంది. ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో ఏక్యూఐ 400 అంతకంటే ఎక్కువగానే ఏక్యూఐ నమోదైంది. సింగపూర్ హైకమిషన్ సోషల్ మీడియా వేదికగా అడ్వైజరీ జారీ చేశారు.
కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు ఢిల్లీ-జాతీయ రాజధాని ప్రాంతంలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) లెవల్-4 అమలవుతోందని పేర్కొంది. ఢిల్లీ ప్రభుత్వం ప్రజలు, ముఖ్యంగా పిల్లలు, శ్వాసకోశ, గుండె జబ్బులు ఉన్న వారు ఇంట్లోనే ఉండాలని.. బయటకు వెళ్లిన సందర్భంలో మాస్క్లు ధరించాలని హైకమిషన్ సూచించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ-ఎన్సీఆర్లో నివసించే సింగపూర్ పౌరులు సలహాలు పాటించాలని సింగపూర్ హైకమిషన్ కోరింది. తక్కువ దృశ్యమానత కారణంగా ఢిల్లీ-ఎన్సీఆర్కు, అక్కడి నుంచి వచ్చే విమానాలు ప్రభావితమవుతాయని అడ్వైజరీలో తెలిపింది.
ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, అనేక విమానయాన సంస్థలు సైతం హెచ్చరికలు జారీ చేశాయి. ప్రయాణీకులు అప్డేట్స్ను విమానయాన సంస్థలను సంప్రదించాలని సూచించారు. ఢిల్లీ-ఎన్సీఆర్లో నివసిస్తున్న సింగపూర్ పౌరులకు సహాయం అవసరమైతే వారి ఫోన్ నంబర్లలో సంప్రదించాలని నెంబర్లను విడుదల చేసింది. ఇదిలా ఉండగా.. ఢిల్లీలో వరుసగా మూడోరోజు వాయు కాలుష్యం తీవ్రంగా కొనసాగుతున్నది. దాంతో దేశీయ, అంతర్జాతీయ విమానాలు సైతం ప్రభావితం చేసింది. ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 400కిపైగా విమానాలు ఆలస్యం అయ్యాయి. 61 విమానాలు రద్దు కాగా.. ఐదు విమానాలను దారి మళ్లించారు.
In light of the Indian Central Pollution Control Board invoking Stage 4 of the Graded Response Action Plan, the Singapore High Commission has issued the following advisory for Singapore nationals in the Delhi NCR. – HC Wong pic.twitter.com/vPIv0LjTnd
— Singapore in India (@SGinIndia) December 15, 2025