Pragya Thakur | మీ కూతురు వేరే మతస్తుడితో వెళ్తే కాళ్లు విరగ్గొట్టండి.. లవ్ జిహాద్పై ప్రజ్ఞా సింగ్ సంచలన వ్యాఖ్యలు
Pragya Thakur | మధ్యప్రదేశ్ బీజేపీ నేత ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లవ్ జిహాద్ నుంచి తమ కూతుళ్లను కాపాడుకోవాలని తల్లిదండ్రులకు సూచించింది
Pragya Thakur | మధ్యప్రదేశ్ బీజేపీ నేత ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లవ్ జిహాద్ నుంచి తమ కూతుళ్లను కాపాడుకోవాలని తల్లిదండ్రులకు సూచించింది. విశ్వహిందూ పరిషత్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. లవ్ జిహాద్ పేరుతో మైనారిటీ యువకులు హిందూ అమ్మాయిలను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపించారు. ఒకవేళ మీ కూతురు మీ మాట వినకుండా, మతం కాని వ్యక్తుల ఇళ్లలోకి వెళ్లేందుకు, వారిని పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నిస్తే వారి కాళ్లను విరగ్గొట్టి, ఇంట్లో నుంచి బయటకుపోకుండా కాపాడాలని అన్నారు. అప్పుడే మీ కుటుంబం సురక్షితంగా ఉంటారని వ్యాఖ్యానించారు.
ఇంట్లో కూతురు పుట్టినప్పుడు తల్లిదండ్రులు లక్ష్మీ, సరస్వతి రూపంగా భావించి, సంబరపడతామని ప్రజ్ఞా సింగ్ తెలిపారు. కానీ అదే కూతురు పెరిగి పెద్దయ్యాక మరో మతస్తుడికి భార్య కావడానికి ఎలా సిద్ధపడుతుందని ప్రశ్నించారు. అలా ఇతర మతస్తుడిని కావాలని అనుకున్నప్పుడు ఆ అమ్మాయిని ఆపడం అవసరమని అభిప్రాయపడ్డారు. ఇతర మతాల యువకులను తమ ఇష్టానుసారంగా పెళ్లి చేసుకునే అమ్మాయిలను నియంత్రించాలని తల్లిదండ్రులను ప్రజ్ఞా సింగ్ కోరారు. పిల్లలకు మొదటి నుంచి విలువలను నేర్పించాలని సూచించారు. అయినప్పటికీ వారు మాట వినకపోతే, దారిలో పెట్టేందుకు కొట్టాల్సి వచ్చినా వెనక్కి తగ్గవద్దని అన్నారు. అలాంటి అమ్మాయిలకు గుణపాఠం చెప్పడం చాలా మంచిదని చెప్పుకొచ్చారు.
❗️”Break legs of your daughters if she marries a non-Hindu.”
– BJP leader Sadhvi Pragya Thakur
How many of you would agree with Sadhvi Pragya? pic.twitter.com/EI5OuZYWiO
— Rakesh Kishore 🇮🇳 (@RakeshKishore_l) October 19, 2025
ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ చేసిన ఈ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత భూపేంద్ర గుప్తా తీవ్రంగా ఖండించారు. మత మార్పిడి ఆరోపణలతో మధ్యప్రదేశ్లో ఇప్పటివరకు కేవలం 7 కేసులు మాత్రమే నమోదయ్యాయయని ఆయన తెలిపారు. అయినప్పటికీ ప్రజల్లో ఇంత విద్వేషం ఎందుకు రెచ్చగొడుతున్నారని ఆయన మండిపడ్డారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kuravi | అమ్మమ్మ ఇంటికొచ్చి అనంతలోకాలకు.. నీటి గుంతలో పడి తొమ్మిదేళ్ల బాలుడి మృతి
Pneumonic Plague | న్యుమోనిక్ ప్లేగు అంటే ఏమిటి.. ప్లేగులో ఎన్ని రకాలు ఉన్నాయి..?
Punjab | డ్రగ్స్ వ్యతిరేక కార్యకర్త హత్య కేసు.. నిందితుడి ఇల్లు కూల్చివేత.. షాపు దహనం
Election Schedule | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. మూడు విడతలుగా ఎన్నికలు
Soma Bharat Kumar | హరీశ్ రావుకు ఎటువంటి షోకాజ్ నోటీసు ఇవ్వలేదు : బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

