న్యూఢిల్లీ: హర్యానా ఓటర్ల జాబితాలో బ్రెజిలియన్ మాడల్ ఫొటోను 22 పేర్లతో ముద్రించారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై ఆ మోడల్ లరిస్సా స్పందించారు. ఓట్ చోరీ వార్తల్లో తన పేరు బయటకు రావడం షాక్కు గురి చేసిందన్నారు. చాలా మంది ఇంటర్వ్యూలు అడుగుతున్నారని, ఇలా వైరల్ అవుతానని అనుకోలేదన్నారు.
‘అది నా పాత ఫొటో. 18-20 ఏండ్ల వయసులోది అనుకుంటా. స్టాక్ ఇమేజ్ ప్లాట్ఫామ్ నుంచి దాన్ని కొనుగోలు చేసి ఉంటారనుకుంటా. నన్ను భారతీయురాలిగా పేర్కొంటూ స్కామ్లో భాగం చేశారు. ఇదేం పిచ్చితనం. మనం ఎలాంటి ప్రపంచంలో ఉన్నాం.భారత రాజకీయాలతో నాకు సంబంధం లేదు. ఇలాంటి వదంతులు చూసి ఆశ్చర్యపోయా’ అని అన్నారు.