లక్నో: ఒక కార్యక్రమం కోసం వేదికపై ఏర్పాటు చేసిన ముఖ్య అతిథి కుర్చీపై కూర్చునే విషయంలో బీజేపీ నేతల మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో ఒకరిని మరొకరు కొట్టుకున్నారు. (BJP Leaders Slap Each Other) చెంపలు వాయించుకున్నారు. వాటర్ బాటిళ్లు, కుర్చీలు విసురుకున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి ఎనిమిదేళ్లు పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో గురువారం ఛజలత్ బ్లాక్‌లో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
కాగా, ఈ సందర్భంగా వేదికపై ఉన్న చీఫ్ గెస్ట్ కుర్చీలో కూర్చొనే వివాదంపై బీజేపీ మాజీ ఎమ్మెల్యే రాజేష్ కుమార్ సింగ్ అలియాస్ చున్ను, పార్టీ బ్లాక్ ప్రెసిడెంట్ రాజ్‌పాల్ సింగ్ మధ్య వాగ్వాదం జరిగింది. ఇది కాస్త వారిద్దరి మధ్య ఘర్షణకు దారి తీసింది. దీంతో ఆ ఇద్దరు నేతలు జట్టు పట్టుకుని చెంపలపై కొట్టుకున్నారు. వాటర్ బాటిల్స్, కుర్చీలు విసురుకున్నారు. ఈ నేపథ్యంలో ఆ కార్యక్రమానికి హాజరైన మహిళలు భయపడి అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
यूपी : मुरादाबाद में BJP सरकार के 8 साल पूरे होने पर कार्यक्रम हुआ। चीफ गेस्ट BJP के पूर्व विधायक राजेश सिंह जब कार्यक्रम में पहुंचे तो उन्हें अपनी कुर्सी पर ब्लॉक प्रमुख राजपाल सिंह बैठे मिले। बस फिर क्या…पहले एक दूसरे के बाल नोंचे, फिर थप्पड़ मारे, पानी की बोतल फेंकी गई। pic.twitter.com/pOOvspFNRE
— Sachin Gupta (@SachinGuptaUP) March 27, 2025