Dadi Ratan Mohini: బ్రహ్మకుమారి చీఫ్ దాది రతన్ మోహిని కన్నుమూత
Dadi Ratan Mohini: బ్రహ్మకుమారి చీఫ్ అడ్మినిస్ట్రేటర్ దాది రతన్ మోహిని కన్నుమూశారు. మార్చి 25వ తేదీన ఆమె వందో పుట్టిన రోజు జరుపుకున్నారు. వందేళ్ల మైలురాయి దాటిన రెండో బ్రహ్మకుమారిగా రతన్ మోహిని రికార్డు నెలకొల్పారు. అయితే ఆరోగ్యం క్షీణించడంతో ఆమె మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.
న్యూఢిల్లీ: శతాధిక వృద్ధ మహిళ, ఆధ్యాత్మిక నేత, బ్రహ్మకుమారి చీఫ్ అడ్మినిస్ట్రేటర్ దాది రతన్ మోహిని(Dadi Ratan Mohini) కన్నుమూశారు. మార్చి 25వ తేదీన ఆమె వందో పుట్టిన రోజు జరుపుకున్నారు. వందేళ్ల మైలురాయి దాటిన రెండో బ్రహ్మకుమారిగా రతన్ మోహిని రికార్డు నెలకొల్పారు. అంతకుముందు దాది జానకి.. బ్రహ్మకుమారి సంస్థ చీఫ్‌గా చేశారు. దాది జానకి 1916, జనవరి ఒకటో తేదీన జన్మించి, 2020, మార్చి 27వ తేదీన మరణించారు. గత కొన్ని రోజుల నుంచి దాది రతన్ మోహిన్ ఆరోగ్యం సరిగా లేదు. ఆదివారం సాయంత్రం ఆమె పరిస్థితి మరింత క్షీణించింది. రాజస్థాన్‌లోని అబూ రోడ్డులో ఉన్న శాంతివనంలోని ట్రామా సెంటర్‌కు డయాలసిస్ కోసం ఆమెను తరలించారు.
సోమవారం ఆమె పరిస్థితి మరింత ఆందోళనకంగా మారింది. దీంతో క్రిటికల్ కండీషన్లో ఉన్న ఆమెను అహ్మదాబాద్‌లోని జైడస్ ఆస్పత్రికి తరలించారు. మంగళవారం తెల్లవారుజామున 1.20 నిమిషాలకు ఆమె తుది శ్వాస విడిచినట్లు తెలిపారు. అబూ రోడ్డులో ఉన్న బ్రహ్మకుమారి ప్రధాన కార్యాలయంలో శాంతివనంకు ఆమె పార్ధీవదేహాన్ని తీసుకెళ్లనున్నారు.
సింధ్‌లోని హైదరాబాద్‌లో 1925, మార్చి 25వ తేదీన దాది రతన్ మోహిని జన్మించారు. ఆమె ఒరిజినల్ పేరు లక్ష్మీ. చాలా ఉన్నతమైన కుటుంబంలో ఆమె జన్మించారు. హైదరాబాద్, కరాచీ నుంచి ఆమె అంతర్జాతీయ స్థాయిలో బ్రహ్మకుమారి ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. 1954లో జపాన్‌లో జరిగిన వరల్డ్ పీస్ కాన్ఫరెన్స్‌లో బ్రహ్మకుమారీల తరపున ఆమె పాల్గొన్నారు. హాంగ్‌కాంగ్, సింగపూర్, మలేషియాతో పాటు ఆసియా దేశాల్లోనూ ఆమె పర్యటించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

