watch: కుక్క పిల్లను ఎత్తైన భవనం నుంచి పడేసిన బాలుడు.. తర్వాత ఏం జరిగిందంటే?
Boy Throws Puppy | ఒక బాలుడు కుక్క పిల్లను ఎత్తైన భవనం నుంచి కింద ఉన్న రోడ్డుపై పడేశాడు. ఆ సమయంలో అక్కడున్న కొందరు దీనిని చూసినప్పటికీ ఎవరూ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నిరసనలు వెల్లువెత్తాయి.
లక్నో: ఒక బాలుడు కుక్క పిల్లను ఎత్తైన భవనం నుంచి కింద ఉన్న రోడ్డుపై పడేశాడు. (Boy Throws Puppy) ఆ సమయంలో అక్కడున్న కొందరు దీనిని చూసినప్పటికీ ఎవరూ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆ బాలుడిపై కేసు నమోదైంది. ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ఈ సంఘటన జరిగింది. అవెన్యూ గౌర్ సిటీ -2, టవర్ ఆర్-14లో నివసించే తొమ్మిదేళ్ల బాలుడు ఇటీవల జంతు హింసకు పాల్పడ్డాడు. చెట్ల పొదల వద్ద ఉన్న చిన్న కుక్క పిల్లను చేతుల్లోకి తీసుకున్నాడు. ఎత్తైన బిల్డింగ్ పైనుంచి కింద వాహనాలు వెళ్తున్న రోడ్డు వైపు విసిరేశాడు. చాలా ఎత్తు నుంచి రోడ్డుపై పడిన ఆ కుక్క పిల్ల చనిపోయింది.
కాగా, ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో జంతు హింస పట్ల నిరసనలు వెల్లువెత్తాయి. పీపుల్ ఫర్ యానిమల్స్ (పీఎఫ్ఏ) వాలంటీర్ ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫన్ కోసం చిన్న పిల్లలతో ఇలాంటి వీడియో రీల్స్ తీయిస్తున్నారని ఆరోపించాడు. ఇది చూసి మిగతా పిల్లలు కూడా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశాడు. ఇటీవల ఈ ప్రాంతంలో కొన్ని కుక్క పిల్లలు మరణించాయని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో కుక్క పిల్లను రోడ్డు మీదకు విసిరి చంపిన తొమ్మిదేళ్ల బాలుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
UP : ग्रेटर नोएडा की गौर सिटी सोसाइटी में पिल्ले को नीचे फेंकने के मामले में अज्ञात लड़के पर FIR हुई। FIR के खिलाफ आज सोसाइटी निवासियों ने हंगामा–प्रदर्शन किया। https://t.co/2cuhPF4oG6 pic.twitter.com/zubLtnHONG
— Sachin Gupta (@Sachingupta) February 4, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

