దేశంలో టాలెంట్‌కు కొదువలేదు. ముఖ్యంగా పాటలు, డ్యాన్సులు, ఇతరత్రా కళల్లో యువతరం దుమ్మురేపుతున్నది. ఈ వీడియో ఆ కోవకు చెందిందే. ఓ బాలుడు రాహత్ ఫతే అలీ రాసిన ‘ఓ రే పియా’ పాటను అద్భుతంగా పాడాడు. నెటిజన్ల మనసు దోచుకున్నాడు.
ఈ వీడియోను ‘స్టీరియో ఇండియా’ అనే యూజర్ ఇన్‌స్టాలో షేర్చేశారు. వీడియోలో బాలుడు ఒకరు గిటార్ వాయిస్తుండగా ‘ఓ రే పియా’ పాటందుకున్నాడు. మనోహరమైన స్వరంతో మనసు దోచుకున్నాడు. ‘ఓ రే పియా… హయీ’ అనే లిరిక్స్‌తో కూడిన భాగం నెటిజన్ల హృదయాన్ని తాకింది. దీంతో ఈ వీడియో 23.4 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకున్నది. 3 మిలియన్ల లైక్‌లతో వైరల్‌గా మారింది.