జైపూర్: ఒక బాలుడు తన కుటుంబంతో కలిసి గుడికి వెళ్లాడు. వారంతా తిరిగి వస్తుండగా నానమ్మ చేయి పట్టుకుని నడుస్తున్న బాలుడిపై పులి దాడి చేసింది. అతడ్ని నోటకరుచుకుని పొదల్లోకి లాక్కెళ్లి చంపింది. (Boy Killed By Tiger) ఇది చూసి అతడి కుటుంబం షాక్ అయ్యింది. రాజస్థాన్లోని రణతంబోర్ నేషనల్ పార్క్ వద్ద ఈ సంఘటన జరిగింది. బుండి జిల్లాలోని గ్రామానికి చెందిన ఒక కుటుంబం రణతంబోర్ ప్రాంతంలోని ఆలయాన్ని సందర్శించింది. తిరిగి వెళ్తుండగా ఏడేళ్ల బాలుడు తన నానమ్మ చేతిని పట్టుకుని నడిచాడు. ఇంతలో పొదల్లోంచి బయటకు వచ్చిన పులి ఆ బాలుడ్ని నొటకరుచుకున్నది. పొదల్లోకి లాక్కెళ్లి ఆ చిన్నారిని చంపింది. కొన్ని నిమిషాల ముందు ఆ పరిసరాలతోపాటు కోతితో ఫొటోలు దిగిన బాలుడ్ని కళ్లేదుటే పులి లాక్కెళ్లి చంపడం చూసి కుటుంబ సభ్యులు షాకయ్యారు.
మరోవైపు ఈ విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు అక్కడకు చేరుకున్నారు. పులి దాడిలో మరణించిన బాలుడి మృతదేహాన్ని గుర్తించారు. పోస్ట్మార్టం తర్వాత అతడి కుటుంబానికి అప్పగించారు. టెగర్ రిజర్వ్ ప్రాంతమైన రణతంబోర్ నేషనల్ పార్క్లో 70కు పైగా పులులున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు.