Bombay HC | పోర్షే కారుతో ఇద్దరిని గుద్దిచంపిన మైనర్‌కు బెయిల్..!
Bombay HC | మహారాష్ట్రలోని పుణె సిటీలో ఖరీదైన పోర్షే కారుతో ఇద్దరిని గుద్దిచంపిన మైనర్ నిందితుడికి బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అతడికి రిమాండ్ విధించడం చట్టవిరుద్ధమని వ్యాఖ్యానించింది. బాలుడి వయసును పరిగణలోకి తీసుకోకుండా జువైనల్ జస్టిస్ బోర్డు అతడిని రిమాండ్‌కు పంపిందని పేర్కొంది. అబ్జర్వేషన్ హోమ్‌లో ఉన్న అతడిని వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది.
Bombay HC : మహారాష్ట్రలోని పుణె సిటీలో పోర్షే కారుతో ఇద్దరిని గుద్దిచంపిన మైనర్ నిందితుడికి బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అతడికి రిమాండ్ విధించడం చట్టవిరుద్ధమని వ్యాఖ్యానించింది. బాలుడి వయసును పరిగణలోకి తీసుకోకుండా జువైనల్ జస్టిస్ బోర్డు అతడిని రిమాండ్‌కు పంపిందని పేర్కొంది. అబ్జర్వేషన్ హోమ్‌లో ఉన్న అతడిని వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది.
మైనర్ నిందితుడు గత నెల 19న తాగిన మైకంలో కారును ప్రమాదకరంగా నడిపి ఓ బైకును ఢీకొట్టాడు. పుణెలోని కళ్యాణ్ నగర్ ఏరియాలో ఈ ఘటన జరిగింది. ఆ ప్రమాదంలో బైకుపై వెళ్తున్న ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. నిందితుడు దెబ్బతిన్న తన కారును అక్కడే వదిలేసి పారిపోయాడు. అతడి తండ్రి విశాల్ అగర్వాల్ పలుకుబడి ఉన్న వ్యక్తి కావడంతో ముందుగా అరెస్ట్ చేయలేదు.
తర్వాత అరెస్ట్ చేసి జువైనల్ జస్టిస్ బోర్డు ముందు హజరుపర్చగా 300 పదాల ఎస్సే రాయించి వదిలేసింది. దాంతో జనం నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. దాంతో అతడిని మళ్లీ బోర్డు ముందు హాజరుపర్చగా రిమాండ్ విధించింది. బ్లడ్ శాంపిల్స్‌ను మార్చి నిందితుడిని కేసు నుంచి బయటపడేందుకు ప్రయత్నించిన కేసులో అతడి తల్లిదండ్రులు, తాత కూడా అరెస్టయ్యారు. ప్రస్తుతం వాళ్లు జైల్లోనే ఉన్నారు.
ఈ క్రమంలో బాలుడు ఆంటీ అతడి బెయిల్ కోసం బాంబే హైకోర్టును ఆశ్రయించింది. వయసును దృష్టిలో పెట్టుకుని అతడికి బెయిల్ ఇవ్వాలని తన పిటిషన్లో కోరింది. మంగళవారం ఆ పిటిషన్‌పై విచారణ జరిపిన బాంబే హైకోర్టు తాజా ఆదేశాలు ఇచ్చింది. పేరెంట్స్ విడుదలయ్యే వరకు బాలుడు పిటిషనర్ (బాలుడి ఆంటీ) కస్టడీలోనే ఉంటాడని పేర్కొంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

