న్యూఢిల్లీ : అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానానికి ఆదివారం ఈ-మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది. ఏఏ 292 బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం న్యూయార్క్‌లో ఈనెల 22న బయల్దేరింది. కాస్పియన్ సముద్రం దాటిన తర్వాత బాం బు బెదిరింపు వచ్చింది. తనిఖీల కోసం రోమ్‌లో దించాలని అధికారులు ఆదేశించారు. భద్రతాధికారులు అనుమతించిన తర్వాత న్యూఢిల్లీకి బయల్దేరుతుంది. ఈ విమానాన్ని రోమ్‌లో దించినట్లు అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఓ ప్రకటనలో ధ్రువీకరించింది.