Bomb Scare : గుజరాత్ (Gujarat) రాష్ట్రం అహ్మదాబాద్ (Ahmedabad) నగరంలోని 10 స్కూళ్లకు బుధవారం ఉదయం బాంబు బెదిరింపు (Bomb threat) మెయిల్స్ వచ్చాయి. దాంతో ఆయా స్కూళ్ల పరిధిలోని పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆ స్కూళ్ల వద్ద గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. అణువణువు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎలాంటి బాంబులు లేవని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
థాల్టేలోని జెబర్ స్కూల్, ఉద్గమ్ స్కూల్, గురుకుల్ రోడ్‌లోని మహారాజ అగ్రసేన్ స్కూల్, మకర్బాలోని DAV ఇంటర్నేషనల్ స్కూల్, వస్త్రపూర్‌లోని నిర్మాణ్ స్కూల్, విజాల్పూర్లోని జైడల్ స్కూల్, అదలాజ్లోని డివైన్ స్కూల్, డివైన్ చైల్డ్ స్కూల్, కాలోల్లోని ఆవిష్కార్ స్కూల్, బోడక్దేవ్లోని అహ్మదాబాద్ ఇంటర్నేషనల్ స్కూల్, బోపాల్‌లోని న్యూ తులిప్ స్కూల్, DPS లకు ఇవాళ ఉదయం బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి.
బుధవారం ఉదయం 8.35 గంటల ప్రాంతంలో బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయని, మధ్యాహ్నం 1.11 సమయంలో స్కూళ్లను పేల్చేస్తామని ఆ మెయిల్స్‌లో పేర్కొన్నారని అధికారులు తెలిపారు. అదేవిధంగా సబర్మతి జైల్లో కూడా బాంబులు పేలుతాయని ఆకతాయిలు ఆ మెయిల్స్‌లో హెచ్చరించినట్లు చెప్పారు. అదేవిధంగా కేంద్ర హోమంత్రి అమిత్ షాను, గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పేర్లను కూడా వాళ్లు ప్రస్తావించినట్లు వెల్లడించారు.
#WATCH | Gujarat | Police team deployed along with dog squad after 3 schools in Ahmedabad received bomb threats via email today. https://t.co/RS3LtpyAkv pic.twitter.com/8NBg1xFYuo
— ANI (@ANI) December 17, 2025