శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో మంగళవారం ఓ మహిళ దారుణానికి పాల్పడింది. సోపోర్ పట్టణంలోని సీఆర్పీఎఫ్ బంకర్‌పై మహిళ బాంబు దాడి చేసింది. ఈ బాంబు దాడి వీడియోను సీఆర్పీఎఫ్ అధికారులు విడుదల చేశారు. బుర్ఖా ధరించిన మహిళ.. బంకర్ వద్ద ఆగి, బాంబు దాడి చేసినట్లు దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి. కశ్మీర్ ఐజీపీ విజయ్‌కుమార్ ఈ ఘటనపై స్పందించారు. బాంబు దాడికి పాల్పడిన మహిళను గుర్తించామని ఐజీపీ తెలిపారు. త్వరలోనే ఆమెను అదుపులోకి తీసుకుంటామని స్పష్టం చేశారు.
#WATCH Bomb hurled at CRPF bunker by a burqa-clad woman in Sopore yesterday#Jammu&Kashmir
(Video source: CRPF) pic.twitter.com/Pbqtpcu2HY
— ANI (@ANI) March 30, 2022