ముంబై, అక్టోబర్ 2: బాలీవుడ్లో ఓ దిగ్గజ నటుడి కుమారుడిని డ్రగ్స్ కేసులో పోలీసులు శనివారం రాత్రి అరెస్టు చేసినట్టు విశ్వసనీయ సమాచారం. ఎన్సీబీ అధికారులు శనివారం రాత్రి ముంబై పోర్టులోని కార్డీలియా క్రూయిజ్ షిప్లో కొంత మంది డ్రగ్స్ తీసుకొంటున్నారన్న సమాచారంతో రైడ్ చేశారు. డ్రగ్స్ తీసుకొంటున్న 10 మందిని అరెస్టు చేశారు. ఈ 10మందిలోనే నటుడి కుమారుడు ఉన్నట్టు తెలుస్తున్నది. అధికారులు మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకొన్నారు.