అహ్మదాబాద్: భారీ స్థాయిలో డ్రగ్స్ ఉన్న ఇరాన్ బోటు భారత సముద్ర జల్లాల్లోకి ప్రవేశించింది. దీంతో ఇండియన్ నేవీ, ఎన్సీబీ, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) పోలీసులు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. (Iran Boat With Drugs Caught) 700 కిలోల మెత్‌ను స్వాధీనం చేసుకున్నారు. 8 మంది ఇరాన్ జాతీయులను అరెస్ట్ చేశారు. శుక్రవారం తెల్లవారుజామున గుజరాత్ సముద్ర తీరంలోని భారత ప్రాదేశిక జలాల్లో ఇరాన్ బోటు అనుమానాస్పదంగా కనిపించింది. అందులో డ్రగ్స్ ఉన్నట్లు నిఘా వర్గాలు సమాచారం ఇచ్చాయి.
కాగా, ఇండియన్ నేవీ, ఇండియన్ కోస్ట్ గార్డ్ ‘సాగర్ మంథన్ – 4’ అనే కోడ్‌నేమ్‌తో ఆపరేషన్ చేపట్టాయి. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ), గుజరాత్ పోలీస్‌కు చెందిన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్)తో కలిసి ఆ బోటు వద్దకు చేరుకున్నారు. ఇరాన్ బోటును తనిఖీ చేశారు. అందులో ఉన్న మెత్గా పిలిచే 700 కిలోల మెథంఫెటమైన్ను స్వాధీనం చేసుకున్నారు. బోటులో ఉన్న 8 మంది ఇరానీయన్లను అరెస్ట్ చేశారు. ఈ డ్రగ్స్ విలువ మార్కెట్లో రెండు నుంచి ఐదు కోట్ల వరకు ఉంటుందని ఎన్సీబీ అధికారులు తెలిపారు. ఈ డ్రగ్స్ ఎక్కడకు, ఎవరికి సరఫరా చేసేందుకు తరలిస్తున్నారో అన్నది దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
In alignment with our vision for a drug-free Bharat, NCB successfully dismantled an international drug trafficking cartel today, seizing approximately 700 kg of meth in Gujarat. This joint operation with the Indian Navy and Gujarat Police exemplifies our unwavering commitment and… pic.twitter.com/tHFxaFietQ
— NCB INDIA (@narcoticsbureau) November 15, 2024