Board Exams | రాయ్పూర్: కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ 10, 12 తరగతుల విద్యార్థులకు శుభవార్త చెప్పారు. ఛత్తీస్గఢ్లో పీఎంశ్రీ (ప్రైమ్ మినిస్టర్ స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా) పథకాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, ఈ తరగతుల బోర్డు పరీక్షలకు సంవత్సరంలో రెండుసార్లు హాజరయ్యే అవకాశాన్ని 2025-26 విద్యా సంవత్సరం నుంచి కల్పించనున్నట్లు తెలిపారు.
రెండుసార్లు పరీక్షలు రాసి, మెరుగైన స్కోరునే ఉంచుకుని, మిగిలిన దానిని రద్దు చేసుకునే అవకాశం ఇస్తున్నట్లు చెప్పారు. 2020లో ప్రవేశపెట్టిన నూతన జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) లక్ష్యాలను వివరిస్తూ, విద్యార్థులపై విద్యా సంబంధిత ఒత్తిడిని తగ్గించడం ఈ లక్ష్యాల్లో ఒకటి అని తెలిపారు.