Rat Inside Bread Packet: నితిన్ ఆరోరా అనే వ్యక్తి బ్రెడ్ ప్యాకెట్ కోసం ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాడు. డెలివరీ బాయ్ వచ్చి అతనికి బ్రెడ్ ప్యాకెట్ ఇచ్చివెళ్లాడు. ఆ బ్రెడ్ ప్యాకెట్ పైన ఉన్న ప్యాక్‌ను తీసిచూసిన నితిన్ ఆరోరా ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఎందుకంటే అతను అందుకున్న బ్రెడ్ ప్యాకెట్లో ఎలుక ఉంది. ఆ ఎలుక ప్రాణంతో ఉండి కదులుతూ కనిపించింది.
@letsblinkit @blinkitcares pic.twitter.com/CDCvlWbEor
— Namita Chugh (@ChughNamita) February 3, 2023
వెంటనే దాన్ని వీడియో, ఫొటోలు తీసిన నితిన్ ఆరోరా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ కామర్స్ కంపెనీ బ్లింకిట్‌కు ఆన్లైన్లో ఫిర్యాదు చేశాడు. దీనిపై స్పందించిన కంపెనీ నితిన్ ఆరోరాకు క్షమాపణలు చెప్పింది. జరిగిన దానికి పశ్చాత్తాప పడుతున్నామని, మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటామని పేర్కొన్నది.
అదేవిధంగా ఆ బ్రెడ్ ప్యాకెట్‌ను ప్యాక్ చేసి పంపిన పార్ట్నర్ స్టోర్‌ను తమ జాబితా నుంచి తొలగించింది. అదే విషయాన్ని కస్టమర్ నితిన్ ఆరోరాకు తెలియజేసింది. మరోవైపు సోషల్ మీడియాలో కూడా నితిన్ ఆరోరా పోస్ట్ చేసిన వీడియో వైరల్ అయ్యింది. ఈ కామెర్స్ కంపెనీకి, ఆ కంపెనీ పార్ట్నర్ స్టోర్‌కు వ్యతిరేకంగా నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.