ఆగ్రా, జూలై 14 : పార్టీ మహిళా కార్యకర్తలకు వాట్సాప్‌లో అశ్లీల వీడియోలు, మెసేజ్‌లు పంపుతున్న ఓ బీజేపీ నాయకుడికి అతని భార్య సమక్షంలోనే మహిళా సభ్యులు చెప్పులతో దేహశుద్ధి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రాలో బీజేపీ బూత్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ఆనంద్ శర్మ ఇంటిపై ఆదివారం దాడి చేసిన పార్టీకి చెందిన మహిళా కార్యకర్తలు కుర్చీలో కూర్చున్న అతడిని చొక్కా పట్టుకుని బయటకు ఈడ్చుకు వెళ్లి చెప్పులతో చితకబాదారు.
75 సెకండ్లలో 22 సార్లు ఆనంద్ శర్మను మహిళలు చెప్పులతో చితకబాదడం ఆ వీడియోలో కనిపించింది. ఖందౌలీలో ఓ కల్యాణ మండపాన్ని నిర్వహిస్తున్న ఆనంద్ శర్మ నెల రోజుల నుండి తన పార్టీలోనే పనిచేస్తున్న మహిళా కార్యకర్తలకు అశ్లీల వీడియోలు, మెసేజ్‌లు వాట్సాప్‌లో పంపుతున్నట్లు బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు ఆశా అగర్వాల్ మీడియాకు తెలిపారు. ఎన్నిసార్లు హెచ్చరించినా అతను తన బుద్ధి మార్చుకోలేదని ఆరోపించారు.