Angomcha Bimol | ఆ ఎంపీని సస్పెండ్ చేయండి.. రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేసిన బీజేపీ మహిళా ఎంపీలు
Angomcha Bimol : లైంగిక వేధింపులకు పాల్పడ్డట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ ఎంపీ అంగోమ్చా బిమోల్‌ను లోక్‌సభ నుంచి సస్పెండ్ చేయాలని కోరుతూ బీజేపీ మహిళా ఎంపీలు రాష్ట్రపతిని కలిశారు.
Angomcha Bimol : లైంగిక వేధింపులకు పాల్పడ్డట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ ఎంపీ అంగోమ్చా బిమోల్ అకోయిజంను లోక్‌సభ నుంచి సస్పెండ్ చేయాలని కోరుతూ బీజేపీ మహిళా ఎంపీలు రాష్ట్రపతిని కలిశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో మంగళవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన బీజేపీ మహిళా ఎంపీలు కలిసి విజ్ఞప్తి చేశారు. అంగోమ్చాను పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేయాలని వారు కోరారు. బీజేపీ ఎంపీ డి పురందేశ్వరి ఆధ్వర్యంలోని ఎంపీల బృందం రాష్ట్రపతిని కలిసింది.
ఇందులో ఢిల్లీ ఎంపీ బన్సూరి స్వరాజ్ వంటి నేతలున్నారు. మణిపూర్ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి అంగోమ్చా బిమోల్ ఎంపీగా గెలిచారు. ఆయన ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా కూడా పని చేస్తున్నారు. అయితే, ఆయన విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డట్లు గత మే నెలలో యూనివర్సిటీ నిర్వాహకులకు ఫిర్యాదు అందింది. దీనిపై యూనివర్సిటీ ఇంటర్నల్ కమిటీ విచారణ జరిపింది. విద్యార్థినులను తన ఇంటికి రమ్మనడం, ఆ తర్వాత వారితో అసభ్యంగా ప్రవర్తించడం వంటి చర్యలకు పాల్పడ్డట్లు బాధితులు తెలిపారు.
ఈ విచారణలో అతడు లైంగిక వేధింపులకు పాల్పడ్డట్లు తేలడంతో వెంటనే అతడిని విధుల నుంచి తొలగిస్తున్నట్లు యూనివర్సిటీ ప్రకటించింది. అలాగే, ఇతర చట్టపరమైన చర్యలకు సిఫారసు చేసింది. దీంతో ఈ అంశం ఇప్పుడు రాజకీయ అంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అయిన అంగోమ్చాను సస్పెండ్ చేయాలని రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. ఇదే అంశంపై అంతకుముందు, సోమవారం హిమాచల్ ప్రదేశ్‌లో కూడా బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. అలాగే, ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఎదుట కూడా బీజేపీ ఆధ్వర్యంలో నిరసన జరిగింది.
ఈ నిరసన ప్రదర్శనలో కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణా దేవి కూడా పాల్గొన్నారు. మరోవైపు.. లైంగిక వేధింపుల అంశంలో ఎంపీని యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్‌గా తొలగించగా.. ఢిల్లీ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది. యూనివర్సిటీ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదైంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Angomcha Bimol | ఆ ఎంపీని సస్పెండ్ చేయండి.. రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేసిన బీజేపీ మహిళా ఎంపీలు
Eye Sight | భారతీయుల్లో పెరుగుతున్న దృష్టి లోపం సమస్య.. జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు..
Dubai ETCA | దుబాయ్‌లో ఘనంగా ETCA 16వ బతుకమ్మ సంబరాలు.. 6 వేల మందికిపైగా తెలంగాణ ప్రవాసుల భాగస్వామ్యం
కరెంట్ సరఫరాలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం : ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

