రాముడు రాంబోనా?
శ్రీ రామ చంద్రుడిని బీజేపీ రాంబోగా మార్చేసిందని ఛత్తీస్‌గఢ్ సీఎం, కాంగ్రెస్ నేత భూపేశ్ బఘేల్ మండిపడ్డారు. భక్తిభావానికి ప్రతీకగా నిలిచే హనుమంతుడిని కోపానికి, దూకుడుతనానికి చిహ్నం గా మార్చేశారన్నారు. దేశంలో రెచ్చగొట్టే జాతీయవాదానికి బీజేపీ పాల్పడుతున్నదని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
హనుమంతుడు కోపిష్టా..?
శాంత మూర్తులను మార్చేసిన బీజేపీ
ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ ఫైర్
రాయ్‌పూర్, మే 9: శ్రీ రామ చంద్రుడిని బీజేపీ రాంబోగా మార్చేసిందని ఛత్తీస్‌గఢ్ సీఎం, కాంగ్రెస్ నేత భూపేశ్ బఘేల్ మండిపడ్డారు. భక్తిభావానికి ప్రతీకగా నిలిచే హనుమంతుడిని కోపానికి, దూకుడుతనానికి చిహ్నం గా మార్చేశారన్నారు. దేశంలో రెచ్చగొట్టే జాతీయవాదానికి బీజేపీ పాల్పడుతున్నదని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘రాముడిని వాళ్లు రాంబోగా మార్చేశారు. హనుమంతుడు అంటే భక్తిభావంతో ధ్యాన ముద్రలో ఉండేవారు.
ఆయన్ని కోపం, దూకుడుతనం కలిగిన వ్యక్తిగా బీజేపీ, ఆరెస్సెస్ చిత్రీకరిస్తున్నాయి’ అన్నారు. ప్రస్తుతం రెచ్చగొట్టే జాతీయవాదాన్ని సమాజం ఎదుర్కొంటున్నదన్న బఘేల్.. దీనికి బీజేపీనే కారణమని ఆరోపించారు. ఏప్రిల్‌లో పలు రాష్ర్టాల్లో హింసాత్మక ఘటనలు చెలరేగాయని, వాటికి వ్యతిరేకంగా ప్రశ్నించిన గొంతుకలను బీజేపీ అణిచివేయడానికి ప్రయత్నించిందన్నారు. ఈ హింసాత్మక, అణిచివేత ధోరణిని ప్రజలు అర్థం చేసుకొన్న రోజు బీజేపీ ఆటలకు ఎండ్‌కార్డ్ పడుతుందన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Bhupesh Bhagel
- BJP
- deities
- furious
RELATED ARTICLES
తాజా వార్తలు
Puri Jagannadh | ‘జార్జ్ క్రిష్’ సెట్స్‌లో పూరి జగన్నాథ్ సందడి.. శ్రీను వైట్లకు అదిరిపోయే సర్ప్రైజ్!
రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి : డీఎంహెచ్ఓ డా.రాహుల్
Farmers | సాగు నీటి కోసం రెండు గ్రామాల రైతుల వాగ్వాదం.. వీడియో
Prince William: ప్రిన్స్ విలియమ్‌తో కలిసి క్రికెట్ ఆడిన గంగూలీ, రహానే
‘ఉప సర్పంచుల చెక్ పవర్‌పై ఆంక్షలు ఎత్తివేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

