చెన్నై: తమిళనాడు బీజేపీ ప్రధాన కార్యదర్శి కేటీ రాఘవన్ మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. కేటీ రాఘవన్ వీడియో కాల్లో ఒక మహిళ ముందు అర్ధనగ్నంగా నిలబడిన దృశ్యాలను వీడియో ట్యూబర్ మదన్ రవి చంద్రన్ తన చానెల్లో పోస్ట్ చేశారు.
ఈ స్టింగ్ వీడియోలో సదరు రాఘవన్- మహిళ మధ్య ఆడియో ఏమీ వినిపించడం లేదు. అయితే. సంజ్ఞల ద్వారా మహిళ ముందు “షో” చేస్తున్నట్లు వీడియో కనిపించింది. ఆ ద్రుశ్యాన్ని చూడటంతోపాటు రాఘవన్ డిమాండ్ వినగానే ఆ మహిళ ఫోన్ పెట్టేశారని రవిచంద్రన్ తెలిపారు.
ఈ వీడియో బయటకు రావడంతో రాఘవన్ వ్యవహారశైలిపై విమర్శలు వెల్లువెత్తాయి. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కే అన్నామలైని కలిసి రాజీనామా సమర్పించనున్నట్లు ట్వీట్ చేశారు. తన, తన పార్టీ బీజేపీ ప్రతిష్ఠను దెబ్బ తీసేందుకు ఈ వీడియోను రిలీజ్ చేశారని ఆరోపించారు.
బీజేపీ తమిళనాడు శాఖ అధ్యక్షుడు అన్నామలైతో చర్చించాక, పార్టీ పదవికి రాజీనామా చేసినట్లు తెలిపారు. తనపై వచ్చిన ఆరోపణలను నిరాకరించారు. చట్టపరంగా చర్యలు తీసుకుంటానని, ధర్మం గెలుస్తుందన్నారు.