మళ్లీ భగ్గుమన్న మణిపూర్
బీజేపీ పాలిత మణిపూర్ మరోసారి భగ్గుమంది. గత ఏడాదిన్నరకు పైగా జాతుల వైరంతో రగులుతున్న రాష్ట్రంలో మరోసారి హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల మైతీలకు చెందిన 10 మంది మహిళలు, చిన్నారులను కుకీ వర్గీయులు అపహరించుకుపోయారు.
- ఆరుగురు మైతీ మహిళలు,చిన్నారుల మృతదేహాలు లభ్యం
- రాష్ట్రంలో వెల్లువెత్తిన నిరసనలు
- మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడి
- ఇంటర్నెట్ బంద్, కర్ఫ్యూ విధింపు
ఇంఫాల్, నవంబర్ 16: బీజేపీ పాలిత మణిపూర్ మరోసారి భగ్గుమంది. గత ఏడాదిన్నరకు పైగా జాతుల వైరంతో రగులుతున్న రాష్ట్రంలో మరోసారి హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల మైతీలకు చెందిన 10 మంది మహిళలు, చిన్నారులను కుకీ వర్గీయులు అపహరించుకుపోయారు. అయితే వారిలో ఆరుగురు మహిళలు, చిన్నారుల మృతదేహాలు లభ్యమయ్యాయి. దీంతో మణిపూర్‌లోని పలు ప్రాంతాల్లో నిరసనలు పెల్లుబికాయి. ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేశారు. రోడ్లపై టైర్లను కాలుస్తూ రాకపోకలకు అంతరాయం కలిగించారు. పలు చోట్ల దుకాణాలు, మార్కెట్లను మూసివేశారు. తమకు న్యాయం చేయాలంటూ ఆందోళనకారులు ఇంఫాల్‌లో ఉన్న ముగ్గురు మంత్రులు, ఆరుగురు ఎమ్మెల్యేల గృహాలను ముట్టడించి ఆస్తులను ధ్వంసం చేశారు.
ముఖ్యమంత్రి బీరేన్‌సింగ్ ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఇండిపెండెంట్ ఎమ్మెల్యే సపమ్ నిశికాంత సింగ్ ఆ సమయంలో గృహంలో లేకపోవడంతో ఆయనకు చెందిన స్థానిన దినపత్రిక కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. దీంతో శనివారం సాయంత్రం 4.30 గంటల నుంచి ఇంఫాల్ పశ్చిమ, తూర్పు జిల్లాల్లో నిరవధిక కర్ఫ్యూ విధించారు. ముందు జాగ్రత్త చర్యగా ఇంఫాల్ వెస్ట్, ఈస్ట్, బిష్ణుపూర్, తౌబల్, కక్చింగ్, కంగ్పోక్పీ, చురాచాంద్‌పూర్ జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను రెండు రోజుల పాటు నిలిపివేశారు. తొలుత జిరి నది వద్ద శుక్రవారం సాయంత్రం మూడు మృతదేహాలు, బారక్ నదీ ప్రాంతంలో శనివారం మరో మూడు మృతదేహాలు కన్పించాయి. ఆ ఆరు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పంపారు.
అసలేం జరిగిందంటే..
ఇటీవల కుకీ మిలిటెంట్లు, సీఆర్పీఎఫ్ దళాలకు మధ్య ఎన్కౌంటర్ చోటుచేసుకోగా, 10 మందిని భద్రతా దళాలు హతమార్చాయి. ఈ ఘటన అనంతరం జిబ్రామ్లోని బోరోబెక్రాలో ఒక మహిళ, ఆమె ఇద్దరు కుమార్తెలు, ముగ్గురు మైనర్ మనవలు సహా మైతీలకు చెందిన 10 మంది కన్పించకుండా పోయారు. వీరిని కుకీలే అపహరించుకుపోయారని ఆరోపణ. జూన్‌లో మణిపూర్‌లో జరిగిన హింసాత్మక ఘటనల అనంతరం మైతీలకు చెందిన చాలామంది మహిళలు, పిల్లలు బోరోబెక్రా పోలీస్ స్టేషన్ సమీపంలో ఏర్పాటు చేసిన సహాయ శిబిరాలలో ఉంటున్నారు. సోమవారం సీఆర్పీఎఫ్ క్యాంప్‌పై దాడి చేసిన కొందరు సాయుధులైన కుకీ మిలిటెంట్లు ఈ శిబిరాలలోని వారిని అపహరించుకుపోయారని పలు సంస్థలు ఆరోపించాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

