లక్నో: పండుగలను బీజేపీ రాజకీయం చేస్తోందని ఉత్తరప్రదేశ్లోని ఫైజాబాద్ ఎంపీ అవధేష్ ప్రసాద్ (Awadhesh Prasad) విమర్శించారు. స్థానిక ఎంపీ అయిన తనను అయోధ్య దీపోత్సవానికి ఆహ్వానించలేదని ఆరోపించారు. సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) ఎంపీ అయిన అవధేష్ ప్రసాద్ దీపోత్సవానికి వచ్చేందుకు సిద్ధంగా లేరన్న ఒక స్వామీజీ వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై మండిపడ్డారు. ‘దీపావళి పండుగను బీజేపీ రాజకీయం చేస్తోంది. ప్రజలను విభజిస్తున్నది. దీపోత్సవ్ కార్యక్రమం కోసం నాకు ఎలాంటి పాస్ లేదా ఆహ్వానం అందలేదు. ఈ పండుగ ఏ ఒక్క వర్గానికో, పార్టీకో చెందినది కాదు. ఈ పండుగను అందరం కలిసి జరుపుకుంటాం. నాకు ఆహ్వానం అందకపోయినా అయోధ్యకు వెళ్తా’ అని అన్నారు.
కాగా, ఎంపీ అవధేష్ ప్రసాద్, దీపావళి సందర్భంగా అయోధ్య ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అయోధ్య ఉన్న ఫైజాబాద్ లోక్సభ స్థానం ప్రజలకు తాను ప్రాతినిధ్యం వహించడం గొప్ప అదృష్టమని చెప్పారు. ‘మా పండుగలన్నింటినీ సోదర భావంతో మేం జరుపుకుంటాం. దురదృష్టవశాత్తు పండుగల పేరుతో ప్రజలను విభజించాలని, రాజకీయం చేయాలని బీజేపీ కోరుకుంటున్నది’ అని విమర్శించారు.
#WATCH | Lucknow | On ‘Deepotsav’ event, Ayodhya MP Awadhesh Prasad says, “…BJP is politicising this festival and dividing people. I have not got any pass or invite for Deepotsav. This festival doesn’t belong to any one community. I will be going to Ayodhya today. I have not… pic.twitter.com/Rc5kZ8eh2Z
— ANI (@ANI) October 30, 2024