న్యూఢిల్లీ, అక్టోబర్ 10: బీజేపీ ఎంపీ రమేశ్ బిధూరీ లోక్సభ ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరుకాలేదు. ఇటీవల లోక్సభలో బీఎస్పీ ఎంపీ డానిష్ అలీని ఉగ్రవాది అర్థం వచ్చేలా దూషించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగడమే కాకుండా పలువురు ఎంపీలు ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు. దీంతో మంగళవారం తమ ముందు హాజరై వివరణ ఇవ్వాలని కమిటీ ఆదేశించినప్పటికీ బిధూరీ పట్టించుకోలేదు. పార్టీ తరఫున రాజస్థాన్ ఎన్నికల పనుల్లో బిజీగా ఉన్నానంటూ కమిటీకి బిధూరీ సమాధానమిచ్చారు.