లక్నో, మే 29: బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్ కుటుంబం మరో వివాదంలో చిక్కుకుంది. ఆయన కుమారుడు, కైసర్‌గంజ్ స్థానం బీజేపీ అభ్యర్థి కరణ్‌సింగ్ వాహన కాన్వాయ్ మోటార్ సైకిల్‌పైకి దూసుకెళ్లగా.. ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని గోండా నగర సమీపంలోని రహదారిపై బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది.
ప్రమాదానికి కారణమైన వాహన డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మోటార్ సైకిల్‌పై వస్తున్న రెహన్ ఖాన్(17), షెహజాద్ ఖాన్ (20) ఇద్దరిని ఎస్యూవీ కారు ఢీకొనటంతో, వారిద్దరు ప్రాణాలు కోల్పోయారని కెర్నాల్గంజ్ ఎస్‌హెచ్‌వో తెలిపారు.ప్రమాదంలో 60 ఏండ్ల మహిళ కూడా గాయపడింది.