న్యూఢిల్లీ: పార్లమెంట్లో బీజేపీ, ఇండియా కూటమి నేతల మధ్య తోపులాట జరిగిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో ఇద్దరు బీజేపీ ఎంపీలు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ(Rahul Gandhi)పై కేసు నమోదు చేయాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంబేద్కర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఇవాళ ఇండియా కూటమి పార్లమెంట్ ఆవరణలో ప్రొటెస్ట్ నిర్వహించింది. ఆ సందర్భంలో రెండు వర్గాల మధ్య ఘర్షణాత్మక సంఘటనలు జరిగాయి. బీజేపీ ఎంపీలు ప్రతాప్ సారంగి, ముకేశ్ రాజ్‌పుత్ గాయపడ్డారు.
మరో వైపు గాయపడ్డ బీజేపీ ఎంపీలు ప్రతాప్ సారంగి, ముకేశ్ రాజ్‌పుత్‌లతో ప్రధాని మోదీ ఫోన్లో మాట్లడారు. వారి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆర్ఎంఎల్ ఆస్పత్రిలో ఆ ఇద్దరూ చికిత్స పొందుతున్నారు.