Rajasthan CM | ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రుల విషయంలో బీజేపీ అనూహ్య నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ఆ రెండు రాష్ట్రాల్లోనూ ఎవరూ ఊహించని విధంగా కొత్తవారిని సీఎంలుగా నియమించింది. అయితే, ఇప్పుడు అందరి దృష్టి రాజస్థాన్ సీఎం (Rajasthan CM) పీఠంపైనే ఉంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడై వారం రోజులు గడుస్తున్నా ఇంకా సీఎం ఎవరన్నదానిపై ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. ఈ ఉత్కంఠకు నేడు తెరపడే అవకాశం ఉంది.
బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే భజన్‌లాల్ శర్మ, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఇద్దరు సహ పరిశీలకులు, జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే, జాతీయ ఉపాధ్యక్షురాలు సరోజ్ పాండే సమక్షంలో పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతుంది. సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ సమావేశంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు పాల్గొని శాసనసభా పక్ష నేతను ఎన్నుకోనున్నారు. ఈ సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలందరూ హాజరు కావాలని బీజేపీ ఆదేశించింది.
రాష్ట్రంలో బీజేపీ పార్టీ విజయం తర్వాత బాబా బాలక్ నాథ్ పేరు ప్రచారంలోకి వచ్చింది. ఎంపీ పదవికి రాజీనామా చేసిన రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, దియా కుమారి కూడా సీఎం రేసులో ఉన్నారు. అయితే అందరి దృష్టి మాత్రం రాజస్థాన్ మాజీ సీఎం వసుంధర రాజే (Vasundhara Raje) పైనే ఉంది. కాగా, వసుంధర రాజే సైతం సీఎం పగ్గాల కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. గత వారం ఢిల్లీ వెళ్లిన ఆమె బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. అయితే కొత్త వారిని సీఎం చేయాలన్న యోచనలో బీజేపీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read..
Raj Bhavan | ఆ వార్తలు అవాస్తవం.. టీఎస్పీఎస్సీ చైర్మన్ రాజీనామా ఆమోదంపై రాజ్‌భవన్
Earthquake | ఆప్ఘానిస్థాన్‌ను వణికించిన భారీ భూకంపం
Shoaib Bashir | ఆఫ్ స్పిన్‌తో బెంబేలెత్తిస్తున్న యువ కెరటం.. ఇంగ్లండ్ సరికొత్త అస్త్రం ఇతడేనా..?