భోపాల్: హోలీ సందర్భంగా ఒక వ్యక్తి పట్ల బీజేపీ నేత అనుచితంగా ప్రవర్తించాడు. రంగు పూసి కాళ్లకు మొక్కిన వ్యక్తిని కాలితో తన్నాడు. (BJP Leaders Kicks Man) పైగా ఇది తన ఆశీర్వాదమని సమర్థించుకున్నాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లోని నర్సింగ్‌పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బీజేపీ నేత, తెందుఖేడా మునిసిపాలిటీ చైర్మన్ అయిన విష్ణు శర్మ హోలీ వేడుకలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఒక వ్యక్తి ఆయన ముఖానికి రంగు పూశాడు. ఆ తర్వాత ఒంగి ఆయన కాళ్లకు నమస్కరించాడు. అయితే విష్ణు శర్మ ఆ వ్యక్తి భుజాన్ని తన కాలితో తన్నాడు.
కాగా, ఈ వీడియో క్లిప్‌ను బీజేపీ యువ నేతలు షేర్ చేశారు. హోలీ సందర్భంగా రంగు పూసిన వ్యక్తిని విష్ణు శర్మ ఇలా ఆశీర్వదించినట్లు అందులో పేర్కొన్నారు. అయితే అదే వ్యక్తిని కొన్ని రోజుల కిందట మార్కెట్లో విష్ణు శర్మ కాలితో తన్నిన వీడియో క్లిప్ కూడా ఇటీవల వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ‘రజ్జన్ అనే అదే వ్యక్తిని మళ్ళీ తన్నడానికి హోలీ నాడు పిలిచారు’ అన్న విమర్శలు వెల్లువెత్తాయి.
మరోవైపు బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామ్స్నేహి పాఠక్ ఈ సంఘటనపై స్పందించారు. ఈ వీడియో క్లిప్‌ను తాను చూసినట్లు తెలిపారు. ‘మేం ఆయన (విష్ణు శర్మ)తో మాట్లాడి వివరణ తీసుకుంటాం. ఈ విషయాన్ని పార్టీ దృష్టికి తీసుకువెళ్తాం. వీడియో నిజమైతే తగిన చర్యలు తీసుకుంటాం’ అని మీడియాతో అన్నారు.
नगर परिषद अध्यक्ष विष्णु शर्मा का फिर लात मारने का वीडियो वायरल
मध्य प्रदेश में नरसिंहपुर के तेंदूखेड़ा से नगर परिषद अध्यक्ष विष्णु शर्मा का होली कार्यक्रम में एक व्यक्ति को लात मारने का वीडियो सोशल मीडिया पर वायरल हुआ, जिसमें इसे आशीर्वाद बताया गया. वीडियो को भाजयुमो के मंडल… pic.twitter.com/PzmQSDRLFF
— NDTV MP Chhattisgarh (@NDTVMPCG) March 16, 2025