న్యూఢిల్లీ: బీజేపీ నేత రవీందర్ రైనా, సైనికులతో కలిసి ‘రీల్’ చేశారు. జమ్ముకశ్మీర్‌లోని మంచు పర్వతాల వద్ధ దేశ భద్రత కోసం ఉన్న జవాన్లతో కలిసి ఒక పాటకు అనుగుణంగా రీల్ చిత్రీకరించారు. దీనిని సోషల్ మీడియాలో ఆయన పోస్ట్ చేశారు. (BJP leader ‘reel’ with soldiers) ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు బీజేపీపై మండిపడ్డాయి. పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోవడంతో దేశం దుఃఖిస్తున్న సమయంలో బీజేపీ నేత రవీందర్ రైనా సైనికులతో రీల్ చేయడంపై కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. ‘ఈ విషాద సంఘటన పట్ల రవీందర్ రైనాకు ఎలాంటి బాధ లేదని స్పష్టంగా తెలుస్తుంది. బదులుగా, ఆయన దానిని ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. సోషల్ మీడియాలో తన ఇమేజ్ను పెంచుకోవడంపై దృష్టి సారించారు. ఈ అసభ్యకర ప్రదర్శన బీజేపీ నాయకత్వానికి, ప్రధానమంత్రికి ఆమోదయోగ్యమేనా? సిగ్గుచేటు!’ అని ఎక్స్ పోస్ట్‌లో దుయ్యబట్టింది.
కాగా, శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేది కూడా రైనాపై విరుచుకుపడ్డారు. సరిహద్దుల కంటే బీజేపీ నాయకులను రక్షించడమే నిజమైన ప్రాధాన్యతగా కనిపిస్తోందని ఆరోపించారు. ‘రీల్ గేమ్ సరిగ్గా సరిపోతుంది. మీకు ఈ రకమైన భద్రత ఉంటే, తప్పకుండా ఒక రీల్ చేయండి. భద్రతా దళాలను ఆ తరువాత సరిహద్దులను కాపాడనివ్వండి. ప్రస్తుతం బీజేపీ నాయకులను రక్షించడమే నిజమైన ప్రాధాన్యత’ అని ఎక్స్ పోస్ట్‌లో విమర్శించారు.
कश्मीर में हमारे 28 लोगों को आतंकियों ने मार दिया। इस दुखद घटना से पूरा देश आहत है, शोक में है।
लेकिन…
कश्मीर में BJP के पूर्व प्रदेश अध्यक्ष और राष्ट्रीय कार्यकारिणी सदस्य रविंद्र रैना ये वीडियो बना रहे हैं। बर्फ में अठखेलियां करते हुए रील बना रहे हैं।
साफ नजर आ रहा है… pic.twitter.com/mZQreGtebH
— Congress (@INCIndia) May 5, 2025