న్యూఢిల్లీ: బీజేపీ అగ్ర నేత అద్వానీ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ఢిల్లీలోని అపోలో హాస్పిటల్లో చేర్పించారు. ఆయన డాక్టర్ వివేక్ సూరి పర్యవేక్షణలో ఉన్నారని, ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అపోలో వెల్లడించింది.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, అద్వానీని రెండు రోజుల క్రితమే ఈ దవాఖానలో చేర్పించినట్లు తెలుస్తున్నది.