జైపూర్: బీజేపీ సీనియర్ నేత వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. కేరళలో గోహత్యలు జరుగుతాయని అన్నారు. అందుకే వయనాడ్‌లో కొండచరియలు (Wayanad landslides) విరిగిపడిన విలయంలో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించిందని తెలిపారు. గోహత్యలు ఎక్కడ జరిగినా ఇలాంటి దుర్ఘటనలు జరుగుతూనే ఉంటాయని చెప్పారు. రాజస్థాన్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నేత జ్ఞానదేవ్ అహుజా శనివారం మీడియాతో మాట్లాడారు. కేరళలోని వయనాడ్ విషాదాన్ని గోహత్యలతో ముడిపెట్టారు. కేరళలో ఆవులను వధిస్తారని తెలిపారు. వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన విలయం దీనికి ప్రత్యక్ష పర్యవసానమని చెప్పారు. కేరళలో ఈ ఆచారాన్ని ఆపకపోతే ఇలాంటి విషాదాలు కొనసాగుతాయని ఆయన అన్నారు.
కాగా, గోహత్యలకు పాల్పడిన పలు ప్రాంతాల్లో కేరళ తరహా దుర్ఘటనలు జరుగుతున్నట్లు 2018 నుంచి తాము గమనించామని జ్ఞానదేవ్ అహుజా తెలిపారు. అయితే ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ ప్రాంతాలలో కొండచరియలు విరిగిపడటం, తరచుగా విపత్తులు సంభవించడానికి గోహత్యలతో ఎలాంటి సంబంధం లేదన్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల అక్కడ విపత్తులు సంభవిస్తాయని అన్నారు.
Senior BJP politician Gyandev Ahuja has linked the Wayanad landslides and the prior Kerala flood to cow slaughter practices in Kerala.#WayanadLanslide #wayand #Kerala #Landslide #landslidewayanad #BJP pic.twitter.com/coJEzRuJ1s
— Voice of Bharat (@voicebharat9) August 3, 2024