న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాలో నివసిస్తున్న భారతీయుడు బాలేష్ ధన్కర్పై డజనుకు పైగా లైంగిక వేధింపుల కేసులు నమోదయ్యాయి. కోర్టులో విచారణ సాగుతున్నది.
నిందితుడు ఆస్ట్రేలియాలో ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నట్టు సమాచారం! మీడియా కథనం ప్రకారం నిందితుడు కొరియన్ ఇంగ్లిష్ స్పీకర్స్ ఉద్యోగాల కోసం మహిళలను ఇంటర్య్యూకు పిలిచి వారిపై లైంగిక దాడికి పాల్పడి వాటిని రహస్య కెమెరాతో చిత్రీకరించేవాడు.