Kiara Advani | ప్రదీప్ రంగనాథన్, కృతిశెట్టి కాంబోలో వచ్చిన చిత్రం లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. విఘ్నేశ్ శివన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో నిలదొక్కుకోలేకపోయింది. చాలా రోజుల తర్వాత ఈ సినిమా మరోసారి వార్తల్లో నిలిచింది. డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ ఓ ఆసక్తికర విషయాన్నిషేర్ చేసుకున్నాడు.
యశ్ నటిస్తోన్న టాక్సిక్ ప్రమోషనల్ ఈవెంట్లో విఘ్నేశ్ శివన్ మాట్లాడుతూ.. తాను ముందుగా లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమా కోసం కియారా అద్వానీని కబీర్ సింగ్ ఒకే అయ్యే కంటే ముందే సంప్రదించానన్నాడు.అయితే కియారా అద్వానీ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీలో జాయిన్ కానిదే నయమయిందని.. ఈ సినిమా చేయకపోవడం కియారా అదృష్టమని చెప్పుకొచ్చాడు. లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ బాక్సాఫీస్ రిజల్ట్‌ను ఉద్దేశించి విఘ్నేశ్ శివన్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
కియారా అద్వానీ వన్ ఆఫ్ ది ఫీమేల్ లీడ్ రోల్లో నటించిన టాక్సిక్ రేపు గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా కోసం కియారా గ్లామర్ డోస్ పెంచేసి మూవీపై అంచనాలు అమాంతం పెంచేస్తుంది.
East Coast | పదో తరగతి అర్హత.. పదిహేను వందలకుపైగా పోస్టులు
Konda Surekha | కొండా సురేఖ మాజీ ఓఎస్డీ కేసు.. జూబ్లీహిల్స్ సీఐ సస్పెన్షన్..!