Health Tips : నేటి ఉరుకులు, పరుగుల జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు కాలేయం (Fatty Liver) పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే సరైన ఆహారం, జీవనశైలి మార్పులు చాలా ముఖ్యం. కాలేయం మన శరీరంలో చాలా ముఖ్యమైన అవయవం. ఇది శరీరంలో ఉన్న విష పదార్థాల (Toxins) ను తొలగించడం, రక్తాన్ని శుభ్రపరచడం, శక్తిని నిల్వ చేయడం వంటి అనేక ముఖ్యమైన విధులను నిర్వర్తిస్తుంది. కాబట్టి కాలేయాన్ని కాపాడుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే ముఖ్యమైన ఆహారాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఆకుకూరలు : పాలకూర తదితర ఆకుకూరలు కాలేయానికి చాలా మంచివి. ఇవి శరీరంలో ఉన్న విషాలను తొలగించడంలో సహాయపడతాయి. కాబట్టి ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవాళ్లు తరచూ ఆకుకూరలను తమ ఆహారంలో భాగం చేసుకోవాలి.
వెల్లుల్లి : వెల్లుల్లిలో ఉండే సహజ పదార్థాలు కాలేయాన్ని శుభ్రపరచడంలో సహాయపడతాయి. కాబట్టి వెల్లుల్లిని క్రమం తప్పకుండా ఆహారంలో భాగం చేసుకోవాలి.
సిట్రస్ పండ్లు : నిమ్మ, నారింజ, ఉసిరి వంటి సిట్రస్ జాతి పండ్లలో విటమిన్ C పుష్కలంగా ఉంటుంది. ఈ విటమిన్ C కలిగిన పండ్లను తరచూ తీసుకోవడంవల్ల ఉండి కాలేయాన్ని శుభ్రంగా ఉంచుతాయి.
పసుపు : పసుపు సహజ ఔషధం. వాపును తగ్గించి కాలేయ కణాలను రక్షిస్తుంది. కాబట్టి కాలేయ సమస్య ఉన్నవాళ్లు తమ ఆహారంలో తప్పకుండా సిట్రస్ పండ్లను భాగం చేసుకోవాలి.
బీట్రూట్ రసం : బీట్రూట్ రసం కూడా కాలేయంలో వాపును తగ్గించడంలో సాయపడుతుంది. కాలేయాన్ని శుభ్రపరచడంలో తోడ్పడుతుంది.
టమాటా : టమాటలు కూడా కాలేయ పనితీరును మెరుగుపరుస్తాయి. కాబట్టి కాలేయం ఆరోగ్యం కోసం టమాటలను ఆహారంలో భాగం చేసుకోవాలి.
గ్రీన్ టీ : గ్రీన్ టీ కాలేయంలో కొవ్వు పేరుకుపోవడాన్ని తగ్గిస్తుంది. కాబట్టి తరచూ గ్రీన్ టీ తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
దానిమ్మ : దానిమ్మ పండు కూడా కాలేయ కణాలను రక్షించి రక్తాన్ని శుద్ధి చేస్తుంది. కాబట్టి కాలేయం ఆరోగ్యం కోసం తరచూ దానిమ్మ పండ్లను తినాలి.
వేయించిన ఆహారాలు, జంక్ ఫుడ్, మద్యం వంటి వాటికి దూరంగా ఉండాలి. రోజూ వ్యాయామం చేయడం, కంటినిండ నిద్ర పోవడం చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన ఆహారం, మంచి జీవనశైలి పాటిస్తే కాలేయాన్ని దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.